Monday, October 7, 2024
HomeUncategorizedఆ మ‌హిళ‌ అవమానాల నుంచి యునెస్కో గుర్తింపు

ఆ మ‌హిళ‌ అవమానాల నుంచి యునెస్కో గుర్తింపు

Date:

దేశంలోని కొన్ని ప్రాంతాలు అరుదైన క‌ళ‌ల‌కు, సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు పుట్టినిల్లుగా ఉంటుంది. అలాంటిది ప‌శ్చిమ బెంగాల్‌లోని చౌనృత్యం ఈ జిల్లా సంప్రదాయాలలో ప్ర‌ధాన‌మైన‌ది. పురూలియా నటి మౌషుమి చౌదరి దీనిని ప్రపంచ ఖ్యాతికి తీసుకు వెళ్లారు. రకరకాల మాటలకు, అవమానాలకు ఆమె భయపడలేదు. సమాజం ముందు ధైర్యంగా నిలబడి.. తన ప్రతిభను చూపింది. దీంతో అందరూ ఆ అద్భుత ప్రతిభకు దాసోహం అయ్యారు.. నేడు దేశ విదేశాల్లో ఆమె డ్యాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఐక్య‌రాజ్య‌స‌మితి గుర్తింపు

మౌసుమీ జీవిత కథను ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ గుర్తించింది. ఇటీవల ఢిల్లీలోని యూఎస్ హౌస్‌లో.. హమ్: వెన్ ఉమెన్ లీడ్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో మౌషుమి ఛౌ జీవిత ప్రయాణం కథ ఉంది. ఈ సందర్భంగా మౌషుమీ చౌదరి మాట్లాడుతూ తన ప్రతిభను అందరి ముందు చూపాలని ఎప్పుడూ కోరుకుంటుందన్నారు. ఒక మహిళగా, చౌ సామ్రాజ్యంలో తాను సాధించిన స్థానం పట్ల ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. పల్లెటూరి అమ్మాయి అయినప్పటికీ యునెస్కో లాంటి సంస్థ తనను గుర్తించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు.

తండ్రినే మొద‌టి గురువు

మౌషుమి విషయానికి వస్తే.. కుమారి నది పక్కన పురూలియా వద్ద ఆమె పెరుగుతుంది. 2007-08 నుండి ఆమె చౌ నృత్యంలో శిక్షణ తీసుకుంటోంది. మౌషుమి మొదటి గురువు ఆమె తండ్రి. ఇక మాల్దీలోని చౌ క్యాంప్ రాష్ట్ర-కేంద్రం చొరవతో స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో 2012లో స్థాపించబడింది. అప్పటి నుండి మౌషుమీ నాలుగు గోడల కంచెని బద్దలు కొట్టి మహిళా ఛౌ టీమ్‌ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆమెపై విమర్శల దాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇరుగుపొరుగు వారు వ్యంగ్యంగా మౌషుమిని విమర్శించారు. ప్రతి విషయంలోనూ దూషించడం మొదలు పెట్టారు. అయితే ఇవేవీ ఆమెను అడ్డుకోలేకపోయాయి. తను నమ్మిన మార్గంలో మౌషుమి ముందుకు సాగింది. దేశ విదేశాల్లో ఆమె గుర్తింపు సాధించింది. దీంతో ఐక్యరాజ్యసమితి ఆమెను గుర్తించి సత్కరించారు.