Monday, October 7, 2024
HomeUncategorizedఈ నెల 23నుంచి శాస‌నస‌భ స‌మావేశాలు

ఈ నెల 23నుంచి శాస‌నస‌భ స‌మావేశాలు

Date:

తెలంగాణ శాస‌న‌స‌భ‌, మండ‌లి స‌మావేశాల‌కు నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈ నెల 23 నుంచి శాస‌న‌స‌భ‌, 24 నుంచి శాస‌న‌మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుంది. శాస‌న‌స‌భ స‌మావేశాల నేప‌థ్యంలో జులై 25 లేదా 26వ తేదీల్లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది కాంగ్రెస్ ప్ర‌భుత్వం.

ప‌ది రోజుల పాటు అసెంబ్లీ నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ ప‌ది రోజుల్లో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో గ‌త కొద్ది రోజుల నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆయా శాఖ‌ల అధికారుల‌తో వ‌రుస‌గా చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏయే శాఖ‌ల‌కు కేటాయింపులు ఎలా జ‌ర‌పాల‌నే అంశంపై సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేస్తున్నారు అధికారులు.