Monday, October 7, 2024
Homeక్రైంఆధార్ నంబర్ తో డబ్బులు కాజేస్తున్నారు

ఆధార్ నంబర్ తో డబ్బులు కాజేస్తున్నారు

Date:

సైబర్ నేరగాళ్లు ఇటీవల ఓ కొత్త పద్దతిలో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెర తీశారు. డివైజ్ లను హ్యాక్ చేయడం ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు సైబర్ నేరాలను అడ్డుకునేందుకు గట్టి నిఘా పెంచాయి. అంతే రేంజ్ లో సైబర్ నేరగాళ్లు కూడా తమ క్రిమినల్ బుర్రలకు పదును పెడుతు న్నారు. హ్యాకర్లు AePS ను ఉపయోగించి ప్రజలను బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. AEPS సర్వీసులను ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టగా ఈ సర్వీస్ ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. అసలు AePS అంటే ఏందీ.. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు ఎలా బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారో తెలుసుకుందాం. 

AePS అంటే ఏంది?

AePS అంటే ఆధార్ కార్డు ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్.. దీని ద్వారా ఆధార్ కార్డు వినియోగం, బయోమెట్రిక్ పద్దతులను వినియోగించి బ్యాంకు ఖాతాలను డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు లింకప్ చేస్తారో వారి వివరాలు AePS ద్వారా అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా చెక్ బుక్, ఏటీఎం కార్డు లేకుండానే డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ నగదు బదిలీలను రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పరిమితులను విధించడంతో కొంత వరకు కస్టమర్లు మేలు జరుగుతుంది.

AePS ద్వారా ఎలా మోసం చేస్తారంటే..

AePs ను ఉపయోగించడం ద్వారా ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి.. దాని ద్వారా కొత్త కొత్త పద్దతుల్లో ప్రజలను మోసం చేస్తారు. మొదట ఫ్రాడ్ స్టర్లు.. ప్రభుత్వ కార్యాలయనుంచి భూములకు సంబందించిన అన్ని డాక్యుమెంట్లు సేకరిస్తారు. ఇది ప్రజల ఫింగర్ ఫ్రింట్ లను కలిగి ఉంటాయి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ కొరకు దొంగిలించిన డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలను సేకరిస్తారు. ఆధారు కార్డు నంబర్, బయోమెట్రిక్ వివరాలు తెలుసుకొని బ్యాంక్ ఖాతాలనుంచి సులభంగా నగదు దొంగిలిస్తారు.

ఏవిధంగా సైబర్ క్రైం నుంచి రక్షించుకోవాలంటే..

AePS ద్వారా సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే.. వినియోగదారులు ఖచ్చితంగా తమ ఆధార్ కార్డును భద్రంగా .. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా దాచుకోవాలి. దీని ద్వారా డేటా స్టీల్ కాకుండా జాగ్రత పడవచ్చు. మాస్క్ చేసిన ఆధార్ కార్డును వినియోగించాలి లేదా ఒరిజినల్ ఆధార్ కార్డుకు బదులుగా.. వెర్చువల్ ఐడీ కార్డు నంబరును వినియోగించాలి. UIDAI వెబ్ సైట్ లోకి వెళ్లి మాస్క్ చేయబడిన ఆధార్ కార్డు లేదా VID నంబర్ గల ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనికోసం ఆధార్ కార్డు నంబరు, లింక్ చేయబడిన మొబైల్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది.