Monday, October 7, 2024
HomeUncategorizedక‌ర్ణాట‌క అసెంబ్లీలో 'ఏఐ' కెమెరాలు

క‌ర్ణాట‌క అసెంబ్లీలో ‘ఏఐ’ కెమెరాలు

Date:

క‌ర్ణాట‌క అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ప్రజాప్రతినిధుల హాజరును పర్యవేక్షించేందుకు కర్ణాటక అసెంబ్లీ కీలక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అసెంబ్లీలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన ‘ఏఐ’ కెమెరాలను ఏర్పాటు చేసింది. చట్టసభ సభ్యుల రాకపోకలతోపాటు వారు సభలో ఉన్న వ్యవధిని నమోదు చేసేందుకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. సమావేశాల్లో సభ్యుల హాజరు, సభలో వారి భాగస్వామ్యాన్ని మరింత మెరగుపరిచేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చామని అధికారులు పేర్కొన్నారు.

”కోరం బెల్‌ మోగకముందే అసెంబ్లీలోకి వచ్చే ఎమ్మెల్యేలను గుర్తించి, వారి పేర్లను చదివి ప్రశంసించే సంప్రదాయం ఉంది. కొందరు సీనియర్‌ సభ్యులు ఆలస్యంగా వచ్చినప్పటికీ సాయంత్రం ఎక్కువ సమయం సభలోనే ఉంటుంటారు. అలాంటి వారిని గుర్తించకపోవడం అన్యాయంగా భావిస్తున్నాం. ఈ క్రమంలో సభలోకి రావడం, నిష్ర్కమణ సమయాన్ని నమోదు చేసేందుకు కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశాం” ” అని స్పీకర్‌ యూటీ ఖాదర్‌ పేర్కొన్నారు. ఈ విధానం తీసుకురావడంతో చొరవ చూపిన స్పీకర్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, విపక్ష నేత ఆర్‌ ఆశోకాతోపాటు ఇతర చట్టసభ సభ్యులు అభినందించారు.