Thursday, January 23, 2025
HomeUncategorizedవీరు ట్రాఫిక్ సిగ్న‌ల్ జంప్ చేస్తే జ‌రిమానా లేదు

వీరు ట్రాఫిక్ సిగ్న‌ల్ జంప్ చేస్తే జ‌రిమానా లేదు

Date:

బెంగళూరులో అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినా జరిమానా విధించమని పోలీసులు పేర్కొన్నారు. అటువంటి సందర్భంలో ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా జరిమానాలు జారీ చేస్తే ప్రయాణికులు ఇన్‌ఫాంట్రీ రోడ్‌లోని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. కర్ణాటక స్టేట్ పోలీస్ యాప్ ద్వారా కూడా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అనుచేత్ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఉన్న కెమెరాలు ప్రతీ ఐదు సెకన్లకు వాహనదారుల కదలికలను రికార్డ్‌ చేస్తాయని, అంబులెన్స్‌కు దారివ్వడానికి వాహనదారుడు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానా రద్దు అవుతుందన్నారు.