Sunday, October 6, 2024
HomeUncategorizedస‌హ‌జీవ‌నం చేసేవారికి కొన్ని హ‌క్కులు ఉన్నాయి

స‌హ‌జీవ‌నం చేసేవారికి కొన్ని హ‌క్కులు ఉన్నాయి

Date:

ఆడ‌, మ‌గ ఇద్ద‌రు వ్య‌క్తులు పెళ్లి చేసుకోకుండా క‌లిసి ఉంటే దానిని స‌హ‌జీవ‌నం అంటారు. పెళ్లి చేసుకోకుండా లివ్ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటకు కూడా చట్టపరంగా కొన్ని హక్కులు ఉంటాయి. సహజీవనం చేసేవారు కోరుకున్నట్లు జీవించాలంటే, ప్రస్తుతం వారికి మద్దతు ఇస్తున్న చట్టాలు, హక్కులపై అవగాహన అవసరం. భారతదేశంలో పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 వంటి చట్టాలు ప్రతి ఒక్కరి జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రతను కాపాడతాయి. సహజీవనం చేసేవారు ఇలాంటి చట్టాల ప్రకారం వేధింపులు, హింసకు వ్యతిరేకంగా పోరాడవచ్చు, గౌరవంగా జీవించవచ్చు.

*జుడీషియల్‌, లెజిస్లేటివ్‌ సపోర్ట్‌

ఇటీవల కాలంలో శాసన, న్యాయ వ్యవస్థలు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించేవారి హక్కులను గుర్తించాయి. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ ప్రతిపాదన ఈ విషయంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది చట్టంగా ఆమోదం పొందితే, లివ్‌-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరికి చట్టపరమైన హక్కులు వర్తిస్తాయి.

  • గృహ హింస చట్టం

సహజీవనంలో ఉన్న అవివాహిత జంటలకు గృహ హింస చట్టం కింద రక్షణ ఉంటుంది. ఈ చట్టం, రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారు గృహ హింసను ఎదుర్కొంటే చట్టపరమైన పరిష్కారాలు పొందే అవకాశం కూడా ఉంది. ఈ రక్షణ మహిళలు న్యాయం పొందేందుకు, వేధింపులకు భయపడకుండా జీవించడానికి సహాయపడుతుంది.

  • ఆర్థిక భద్రత

అవివాహిత జంటలకు ఆర్థిక భద్రత అనేది భారతీయ చట్టంలోని మరొక కీలకమైన అంశం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 125(1)(a) ప్రకారం, లివ్‌-ఇన్ రిలేషన్స్‌లో భాగస్వాములు, వివాహంలో జీవిత భాగస్వాములకు సమానమైన మెయింటెనెన్స్‌కి అర్హులు. ఈ నిబంధన ఆర్థిక స్థిరత్వం, భాగస్వాముల మధ్య సంబంధాలను ప్రోత్సహిస్తుంది.

  • అవివాహిత జంటలకు జన్మించిన పిల్లల హక్కులు

అవివాహిత జంటలకు జన్మించిన పిల్లల లీగల్ స్టేటస్ కూడా ఇటీవల కాలంలో మెరుగుపడింది. పెళ్లి చేసుకున్న వారికి జన్మించిన వారితో పోలిస్తే, లాంగ్ టర్మ్ లివ్-ఇన్ సంబంధాల్లో ఉన్నవారికి పుట్టిన పిల్లలు వివక్షను ఎదుర్కోకూడదని కోర్టులు తీర్పు ఇచ్చాయి. హిందూ మైనారిటీ, గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం, ఈ పిల్లలకు హక్కులకు రక్షణ లభిస్తోంది. ముఖ్యంగా ఆస్తి హక్కులు, కస్టడీ విషయాలకు సంబంధించి నిర్దిష్ట నియమాలు ఉన్నాయి.

  • భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

అవివాహిత జంటలను సమాజంలో పూర్తి స్థాయిలో అంగీకరించకపోయినా, భారతదేశంలో వారికి అందుబాటులో ఉన్న చట్టపరమైన హక్కులు రక్షణ అందిస్తాయి. ఈ హక్కులు వేధింపులు, హింస, ఆర్థిక అస్థిరత నుంచి రక్షణ పొందడంలో సహాయపడతాయి. ఈ చట్టపరమైన నిబంధనలు అవివాహిత జంటలు సామాజిక పక్షపాతం లేకుండా గౌరవంగా జీవించేలా నిర్ధారిస్తాయి. అవివాహిత జంటలు తమ సంబంధాలు నమ్మకంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ హక్కులను అర్థం చేసుకోవడం, అమలు చేయడం చాలా కీలకం. సరైన లీగల్ నాలెడ్జ్ ఉంటే, వారు తమను తాము రక్షించుకోవచ్చు. బలమైన, గౌరవప్రదమైన రిలేషన్స్‌ నిర్మించుకోవచ్చు.