Sunday, October 6, 2024
HomeUncategorizedప్ర‌పంచంలో ఎత్తైన క‌నుమ‌పై డ్రోన్ ప‌రీక్ష‌

ప్ర‌పంచంలో ఎత్తైన క‌నుమ‌పై డ్రోన్ ప‌రీక్ష‌

Date:

బెంగళూరుకు చెందిన న్యూస్పేస్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కనుమగా పేరున్న లద్ధాఖ్‌లోని ఉమ్‌లాంగ్‌ లా పాస్‌ వద్ద డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. దీనిని ఈ శ్రేణి డ్రోన్ల సామర్థ్యంలో ప్రపంచ రికార్డుగా చెబుతున్నారు. ఇది దాదాపు 25 కిలోల పేలోడ్‌ తీసుకొని.. 100 కిలోల టేకాఫ్‌ సామర్థ్యంతో పని చేసింది.

ఓ ఆంగ్ల పత్రికకు ఆ కంపెనీ సీఈవో సమీర్‌ జోషీ స్వయంగా ఈవిషయాన్ని వెల్లడించారు. ఈ డ్రోన్‌ పనిచేసే పరిధి కూడా చైనాకు చెందిన డీజేఐ ఫ్లైకార్ట్‌ 30 రకం కంటే చాలా మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 24న చైనా డీజేఐ డ్రోన్లను మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద ప్రదర్శించింది. అయితే తమ డ్రోన్‌ సముద్రమట్టం కంటే దాదాపు 6,200 మీటర్ల ఎత్తులో కూడా విజయవంతంగా ఎగిరిందని న్యూస్పేస్‌ సీఈవో పేర్కొన్నారు.

100 కేజీల అత్యధిక టేకాఫ్‌ శ్రేణిలో న్యూస్పేస్‌ డ్రోన్‌దే ప్రపంచ రికార్డని జోషీ వెల్లడించారు. తమ డ్రోన్లు సైనిక, పౌర అవసరాలకు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ”ఈ డ్రోన్ల రవాణాకు, విపత్తు నిర్వహణ, సహాయక చర్యలు, మెడికల్‌ రిలీఫ్‌ సేవలకు మెరుగ్గా ఉపయోగపడుతుంది” అని జోషీ పేర్కొన్నారు.