Sunday, October 6, 2024
Homeక్రైంవిరాట్ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు

విరాట్ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు

Date:

ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై తాజాగా బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదిన బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్లు, బార్‌లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా రాత్రి వరకు తెరచి ఉన్న పబ్బులు, క్లబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని కస్తూరాబా రోడ్డులో విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్‌పై పోలీసులు రైడ్ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత సమయానికి మించి పబ్ తెరిచినందుకు విరాట్ కోహ్లి పబ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా తెల్లవారుజామున 1.20 గంటల వరకు పబ్‌లను తెరిచారంటూ కస్తూరాబా రోడ్డులోని వన్ 8 కమ్యూన్, చర్చి స్ట్రీట్‌లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్డులోని పాంజియో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు పబ్ తెరిచి ఉన్నట్టు సమాచారం అందడంతో.. దీంతో పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, పబ్‌లు తెరిచి ఉన్నట్లు తెలిసింది. అందులో కస్టమర్లు కూడా ఉన్నారు. దీంతో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణీత సమయానికి మించి పబ్ తెరిచారంటూ పోలీసులు పలు రెస్టారెంట్లు, పబ్‌లపై కేసు నమోదు చేశారు.