Friday, September 20, 2024
HomeUncategorizedఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం

Date:

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒక వ్యక్తి భారీగా నాటకానికి తెర లేపాడు. తను చనిపోయినట్లుగా నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని భావించాడు. అనుకున్నదే తడువుగా ప్లాన్ వేశాడు. ఓ మృతదేహాన్ని తీసుకొచ్చి తను చనిపోయినట్లు కట్టుకున్న భార్యతో సహా ఊరంతా నమ్మారు. కానీ పోలీసులు మాత్రం అతని నాటకాన్ని కనిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన కేతమళ్ల పూసయ్య వ్యవసాయంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో పలు అవసరాలకు అప్పులు తీసుకున్నాడు. అయితే అప్పులు చెల్లించేంత ఆదాయం లేదు. దీంతో అప్పులు కట్టలేకపోయాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో అతని మదిలో ఓ ఆలోచన మొలకెత్తింది. తనకు రూ.40 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్లు గుర్తుకు వచ్చింది.

తన చనిపోతే డబ్బులు వస్తాయి కదా అని భావించాడు. కానీ తని చనిపోకుండా చనిపోయినట్లు నాటకమాడాలని నిర్ణయించుకున్నాడు. ఓ శవాన్ని తీసుకొచ్చి తని చనిపోయినట్లు నమ్మించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం రాజమండ్రి దగ్గరలోని మోరంపూడికి చెందిన ఇద్దరు యువకుల సహకారం తీసుకున్నాడు. తనకు శవం కావాలని.. శవం తీసుకొస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే పాత బొమ్మారులో జనవరి 23న నెల్లి విజయరాజ్ అనే వ్యక్తి మృతిచెందాడు. ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చిపేట్టారు. విషయం తెలుసున్న సదరు యువకులు అదే రోజు తర్వాతి రోజు రాత్రి శ్మాశనవాటిలో పూడ్చిపెట్టిన విజయరాజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. వీరంపాలెంకు తీసుకొచ్చి పూసయ్యకు అప్పగించారు. పూసయ్య వారికి తన సెల్ ఫోన్, చెప్పులు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పూసయ్య పొలం వద్ద ఆ ఇద్దరు యువకులు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పూసయ్య ఫోన్, చెప్పులను అక్కడ విడిచి పెట్టి వెళ్లారు. దీంతో పూసయ్య చనిపోయారని అంతా నమ్మారు. అయితే ఆయన భార్యకు కూడా నిజంగానే తన భర్త చనిపోయాడని నమ్మింది. అయితే పూసయ్య తను బతికే ఉన్నట్లు భార్యకు తెలిపాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పూసయ్యను పట్టుకున్నారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.