Saturday, October 5, 2024
HomeUncategorizedఇంకా బ్యాంకులకు చేరని రూ.2000 నోట్లు

ఇంకా బ్యాంకులకు చేరని రూ.2000 నోట్లు

Date:

దేశంలో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలగించింది. అయితే రూ.2000 నోట్లలో 97.87 శాతం తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. అయితే రూ.7,581 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ తన డేటాలో వెల్లడించింది. 2023 మే 19న చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2000 డినామినేషన్ బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. జూన్ 28, 2024న వ్యాపారం ముగిసే సమయానికి రూ.7,581 కోట్లకు తగ్గింది.

రూ.2000 నోట్లలో 97.87 శాతం జూన్ 28, 2024 నాటికి బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉంది. మే 19, 2023 నుండి, రూ. 2000 బ్యాంకు నోట్లను మార్చుకునే సదుపాయం కూడా రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది.