Saturday, October 5, 2024
HomeUncategorizedఢిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ

ఢిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ

Date:

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను ఢీల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి ఢీల్లీకి తరలించిన విషయం తెలిసిందే. వారం రోజుల ఈడీ కస్టడీ అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించాక.. ఏప్రిల్‌లో విచారణ సందర్భంగా సీబీఐ రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరచగా.. 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కవిత జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటున్నారు.

ఢిల్లీ మద్యం కేసు కీలక దశలో కొనసాగుతున్న తరుణంలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు. సీబీఐ, ఈడీ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.