Saturday, October 5, 2024
HomeUncategorizedఢిల్లీలో వర్షాలకు 10కి చేరిన మృతులు

ఢిల్లీలో వర్షాలకు 10కి చేరిన మృతులు

Date:

దేశ రాజధానిలో ఢిల్లీలో ఐఎండి అంచనాలకు మించి వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య ఢిల్లీలో కరెంట్ షాక్ తో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారు జామున వసంత్ విహార్‌లో గోడ కూలి ఐదుగురు మరణించారు. ముగ్గురు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఢిల్లీ అంతటా వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 10కి పెరిగింది.

నిన్న (జూన్ 28) దేశ రాజధాని ఢిల్లీని కుండ పోత వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 100 ఏళ్లలో జూన్‌లో అత్యధిక వర్షపాతం ఇదే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలో దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం..ఇండ్లు, వాహనాలు నీట మునిగాయి. చెట్లు కూలాయి.. ఎక్కడ చూసినా నీళ్లే.. రహదారులన్నీ నీటి మునగడంతో భారీగా ట్రాఫిక్ జామ్.గురువారం (జూన్28) ఈదురుగాలులతో కూడిన వర్షం.. ఢిల్లీ ఎయిర్ పోర్టు లో రెండు టెర్మినల్ పూర్తి కూలిపోయాయి. ఒకరు చనిపోయారు..వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈస్ట్ ఢిల్లీలో వీధుల్లో మోకాళ్లోతు నీరు చేరింది.వీధులన్నీ చెరువుల్లా కనిపించాయి. ఎక్కడ చూసినా మోకాళ్లోతు నీళ్లు.. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. సబ్ వేలు నీటమునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలతో ఢీల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.