హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని, వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దటానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్ఆర్ నుంచి టెక్స్టైల్ పార్కును అనుసంధానించాలని చెప్పారు. స్మార్ట్‌సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన.. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.