Sunday, November 17, 2024
HomeUncategorizedమీ భర్తలతో ఇలా తాగుడు మాన్పించండి

మీ భర్తలతో ఇలా తాగుడు మాన్పించండి

Date:

మద్యపానం పచ్చని సంసారాలను విచ్ఛిన్నం చేస్తోంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా ఓ సూచన చేశారు.

నారాయణ్‌ సింగ్ మాట్లాడుతూ..”ఆడవారు తమ ఇంట్లోని పురుషులు మద్యం మానేయాలని కోరుకుంటే.. ముందుగా వారిని బయట తాగొద్దని చెప్పండి. ఆ మద్యాన్ని ఇంటికి తెచ్చుకొని, మీ ముందు కూర్చొని తాగమని చెప్పండి. వారు కుటుంబసభ్యుల ముందు తాగితే.. ఆ అలవాటు వారిలో క్రమంగా తగ్గడం ప్రారంభం అవుతుంది. తర్వాత రోజుల్లో దానికి పూర్తిగా దూరం అవుతారు. వారు తమ భార్యాపిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతారు. దానిని పిల్లలు చూస్తే వారు కూడా అదే దారిలో నడిచే ప్రమాదం ఉంటుందని వారికి గుర్తుచేయండి. ఈ పద్ధతి బాగా పని చేయొచ్చు” అని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. ”మంత్రి ఉద్దేశం బాగానే ఉన్నప్పటికీ.. ఆయన దానిని చెప్పిన విధానం సరిగా లేదు. ఇంట్లో మద్యం తాగడం వల్ల ఆ ఇల్లు గృహహింసకు కేంద్రంగా మారుతుంది. ఈ సలహా బదులుగా అసలు తాగొద్దని చెప్తే బాగుండేది” అని భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది.