Saturday, October 5, 2024
HomeUncategorizedస్త్రీ, పురుషులు సైకిల్ చక్రాల్లాంటివారు.. కానీ

స్త్రీ, పురుషులు సైకిల్ చక్రాల్లాంటివారు.. కానీ

Date:

స్త్రీ, పురుషులిద్దరూ సైకిల్‌కు ఉన్న రెండు చక్రాల్లాంటివారన్నారని, లింగ సమానత్వంపై ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక చక్రం సాయం లేకుండా మరో చక్రం ముందుకెళ్లదన్నారు. అలాగే స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అన్నారు. కానీ, వారి వారి మార్గాల్లో ప్రత్యేకంగా ఉంటారని వివరించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు.

సమానత్వం అంటే ఏమిటి..? ముందుగా దానికో నిర్వచనం తెలుసుకోవాలన్నారు. పురుషుల కంటే మహిళలు చాలా భిన్నంగా ఉంటారని వివరించారు. స్త్రీలకు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంటుందన్నారు. పరిస్థితుల్ని చక్కబెట్టగలరని, అర్థం చేసుకునే స్వభావం వారికి ఉంటుందన్నారు. అదే పురుషుల విషయానికొస్తే.. వారు మహిళలంత భావోద్వేగులు కాదని అభిప్రాయపడ్డారు. ‘పురుషుల్లో మంచి ఇంటిలిజెంట్‌ కోషెంట్‌ ఉండొచ్చు కానీ, మంచి ఈక్యూ (ఎమోషనల్‌ కోషెంట్‌) ఉండదు’ అని సుధామూర్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.