Saturday, October 5, 2024
HomeUncategorizedవీధి శునకం కోసం రతన్‌ టాటా అభ్యర్థన

వీధి శునకం కోసం రతన్‌ టాటా అభ్యర్థన

Date:

ప్రపంచ బిలియనీర్లలో ఒకరైనా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గొప్ప మనసున్న టాటా ఎంతోమందికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటి ఆయన ముంబయి వాసులను సహాయం చేయమని కోరారు. ఓ వీధి శునకం ప్రాణాలు కాపాడమంటూ అభ్యర్థించారు. సోషల్‌ మీడియాలో టాటా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. రతన్‌ టాటాకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో మనందరికీ సుపరిచితమే. జంతువుల కోసం ఓ ఆస్పత్రిని కూడా నిర్మించారు. అయితే.. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఏడు నెలల వీధి శునకానికి సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయినా దాని ఆరోగ్యం మెరుగుపడలేదు. అది రక్తహీనతతో పాటు మరికొన్ని సమస్యలతో బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ మూగజీవి పరిస్థితిపై టాటా ఆందోళన వ్యక్తంచేశారు. దాన్ని కాపాడేందుకు సాయం చేయాలని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ముంబయివాసులను కోరారు.

ఏడు నెలల శునకం మా ఆస్పత్రిలో చేరింది. అది ఎనిమియాతో బాధ పడుతోంది. ఆ మూగజీవాన్ని కాపాడేందుకు మా సిబ్బంది ఎంతో శ్రమిస్తోంది. కానీ.. చికిత్స కోసం శునకానికి దాత రక్తం అవసరమైంది. ముంబయి వాసులారా దయచేసి సాయం చేయండి. మీ వద్ద పూర్తి ఆరోగ్యంతో ఉన్న శునకం నుంచి రక్తాన్ని దానం చేయండి. మీరు సాయం చేస్తారని ఆశిస్తున్నా” అని రతన్‌టాటా కోరారు. బాధిత శునకం ఫొటోను షేర్‌ చేసిన ఆయన.. దాతకు ఉండాల్సిన అర్హతలను తెలిపారు.