Saturday, October 5, 2024
HomeUncategorizedరోడ్లు సరిగా లేకుంటే టోల్ బంద్

రోడ్లు సరిగా లేకుంటే టోల్ బంద్

Date:

రోడ్లు సరిగా నిర్వహించలేనప్పుడు టోల్‌ వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు రోడ్లపై టోల్‌ ఛార్జీల వసూలు గురించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుంతలతో కూడిన రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలుపై నిర్వహించిన గ్లోబల్‌ వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

”మీరు మంచి సేవలు అందించలేనప్పుడు టోల్‌ ఛార్జీ వసూలు చేయొద్దు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించారు. చాలామంది ఇప్పటికే సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మంచి రోడ్లు అందివ్వలేనప్పుడు టోల్‌ వసూలు చేయకూడదు. ఒకవేళ గుంతలతో కూడిన రోడ్లపై టోల్‌ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా మేం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది” అని గడ్కరీ అన్నారు. టోల్‌ ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా చూడాలని నేషనల్‌ హైవే ఫీల్డ్‌ ఆఫీసర్లకు సూచించారు.