Saturday, October 5, 2024
HomeUncategorizedలోక్‌సభలో మోడీ, రాహుల్ కరచాలనం

లోక్‌సభలో మోడీ, రాహుల్ కరచాలనం

Date:

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాతో కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఓం బిర్లాను అభినందించే సమయంలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలు కరచాలనం చేశారు. గాంధీ కుటుంబం నుంచి ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మూడో నేతగా రాహుల్ గాంధీ నిలిచారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల తర్వాత ఆయన ఈ ఘనత సాధించారు.

ఓం బిర్లా ఎన్నిక తర్వాత ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ఓం బిర్లాని స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లారు. వరసగా రెండోసారి ఓం బిర్లా దిగువ సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఓం బిర్లా రెండోసారి ఎన్నిక కావడంపై ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. రాబోయే ఐదేళ్లలో మీ మార్గనిర్దేశంలో ముందుకెళ్తామన్నారు. ప్రతిపక్షాలు, ఇండియా కూటమి తరుపున ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభినందించారు. ప్రజల గొంతుకకు మీరే మధ్యవర్తి అని, ప్రభుత్వానికి రాజకీయ అధికారం ఉండొచ్చు, కానీ ప్రతిపక్షాలు కూడా ప్రజల గొంతును వినిపిస్తాయని, ప్రతిపక్షాలను సభలో మాట్లాడేందుకు అనుమతిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.