Monday, December 23, 2024
HomeUncategorizedమహిళల చెప్పులు మాత్రమే దొంగలిస్తాడు

మహిళల చెప్పులు మాత్రమే దొంగలిస్తాడు

Date:

ఒక దొంగ గత కొన్ని సంవత్సరాలుగా కేవలం మహిళల చెప్పులు మాత్రమే దొంగలిస్తున్నాడు. పురుషుల చెప్పులు ఉన్న వాటిని ముట్టుకోడు. ఒక దగ్గర మహళల చెప్పులు దొంగిలిస్తున్న దొంగ ఎట్టకేలకు కెమెరాకు చిక్కాడు. ఒక ఇంటి ముందు ఉన్న మహిళ చెప్పులను అతడు చోరీ చేశాడు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్‌ అయ్యింది. దీంతో లేడీస్‌ చెప్పుల దొంగను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తామరస్సేరికి చెందిన మహిళలు, యువతుల చెప్పులు, బూట్లు గత కొన్నేళ్లుగా చోరీ అవుతున్నాయి. ఇంటి ముందు ఉంచిన చెప్పులను గుర్తి తెలియని వ్యక్తి దొంగిలిస్తున్నాడు. కేవలం మహిళల చెప్పులను మాత్రమే చోరీ చేస్తున్నాడు. ఇళ్ల ముందు మగవారి చెప్పులు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లడం లేదు. ఈ లేడీస్‌ చెప్పుల దొంగ గురించి పోలీసులకు కూడా అంతుపట్టకుండా పోయింది.

మంచి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి స్కూల్‌ సమీపంలోని ఒక ఇంటి వద్దకు వచ్చాడు. ఆ ఇంటి ముందు ఉన్న పలువురి చెప్పుల్లో మహిళ చెప్పులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్‌ అయ్యింది. దీంతో బాధిత మహిళ ఈ వీడియో ఫుటేజ్‌ను పోలీసులకు అందజేసింది. ఈ నేపథ్యంలో చూసేందుకు చాలా హూందాగా ఉండి చాలా కాలంగా ఆ ప్రాంతంలో మహిళల చెప్పులు చోరీ చేస్తున్న ఆ ఆగంతకుడ్ని గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.