Saturday, October 5, 2024
Homeక్రైంబడికి డుమ్మా కొట్టి వివాహేతర సంబంధం

బడికి డుమ్మా కొట్టి వివాహేతర సంబంధం

Date:

విద్యార్థులకు మంచి, చెడులు చెప్పాల్సిన ఉపాధ్యాయిడు తప్పుదోవ పట్టాడు. బడికి డుమ్మా కొట్టి మరీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఉపాధ్యాయుడిని గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటు చేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నెమలిపేటలో ఉన్న ఐటీడీఏ పాఠశాలలో రాందాస్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూ స్కూల్‌కు వచ్చి పాఠాలు చెప్పాల్సిన అతడి బుద్ధి పక్కదారి పట్టింది. స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పాఠశాలకు రాకుండా మహిళతో ఉంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, సదరు మహిళ భర్త.. రాందాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. విషయం తెలుసుకున్న ఎంఈవో కృష్ణయ్య, సీఐ జితేంద్ర అక్కడికి చేరుకుని రాందాస్‌ను విడిపించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.