Friday, October 4, 2024
HomeUncategorizedకొందరి నియంత్రణ కారణంగానే పేపర్‌ లీక్‌లు

కొందరి నియంత్రణ కారణంగానే పేపర్‌ లీక్‌లు

Date:

దేశ విద్యావ్యవస్థపై కొందరి నియంత్రణ కారణంగానే ఈ పేపర్‌ లీక్‌లు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నియంత్రణకు మోదీజీ అవకాశం ఇచ్చారు. వైస్‌ ఛాన్సలర్ల నియామకాలు ప్రతిభ ఆధారంగా జరగడం లేదు. స్వతంత్ర విద్యావ్యవస్థ ధ్వంసమైంది. ఇలాంటి పరిణామాలకు కారకులైన వారికి శిక్ష పడాలి. ఈ పరిస్థితి మారనంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇది దేశ వ్యతిరేక చర్య. ఈ అవకతవకలను మేం పార్లమెంట్‌లో లేవనెత్తుతాం” అని రాహుల్‌ వెల్లడించారు. అలాగే నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లీన్‌ చిట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. తాము ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నామో ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు.

ఇప్పుడు మోడీ ప్రధాన ఎజెండా స్పీకర్ ఎన్నిక. ఆయన తన ప్రభుత్వం, స్పీకర్ పదవి గురించి ఆలోచిస్తున్నారు. మోడీ ప్రజలను భయపెడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రజలు భయపడటం లేదు. ఈ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని వెల్లడిచేశాయి. వినయం, గౌరవం, రాజీ వంటి పదాలకు మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ గౌరవమిచ్చారు. నరేంద్రమోదీకి వాటిపై నమ్మకం లేదు” అని రాహుల్ దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. జూన్ 21న యోగా డే రోజున నీట్‌లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.