Friday, November 15, 2024
Homeక్రైంపిన్నిని లైంగికంగా వేధించిన 10 తరగతి బాలుడు

పిన్నిని లైంగికంగా వేధించిన 10 తరగతి బాలుడు

Date:

పదవ తరగతి చదువుతున్న బాలుడు పిన్నిని లైంగికంగా వేధించాడు. బాలుడి చేష్టలకు ప్రతిఘటించిన ఆమె అతడిని తీవ్రంగా మందలించింది. దీని గురించి కుటుంబ సభ్యులకు చెబుతుందన్న భయంతో ఆ మహిళను బాలుడు హత్య చేశాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉప్పినంగడి సమీప గ్రామానికి చెందిన 37 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆ మహిళ ఇంట్లో ఉన్న పదో తరగతి చదువుతున్న బాలుడు తన తండ్రికి ఫోన్‌ చేశాడు. గుండెపోటుతో పిన్ని చనిపోయిందని చెప్పాడు.

మహిళ అనుమానాస్పద మరణం గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఆమె ఇంట్లో ఉన్న బాలుడిపై అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి వీపుపై చేతితో రక్కిన ఆనవాళ్లు ఉన్నట్లు బాలుడి తండ్రి పోలీసులకు తెలిపాడు. బుధవారం బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో ఆమెను తానే చంపినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న పిన్నితో లైంగిక చర్య కోసం ప్రయత్నించినట్లు ఆ బాలుడు తెలిపాడు. ప్రతిఘటించిన ఆమె తనను మందలించిందని పోలీసులకు చెప్పాడు. అయితే ఇంట్లో వారికి దీని గురించి చెబుతుందేమోనని భయాందోళన చెందానని అన్నాడు. తిరిగి నిద్రలోకి జారుకున్న పిన్ని ముఖాన్ని దిండితో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తనను తోసివేసేందుకు ప్రయత్నించినప్పుడు తన వీపుపై ఆమె రక్కిందని పోలీసులకు వెల్లడించాడు. ఆ బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.