Monday, December 23, 2024
HomeUncategorizedవిమానాల కంటే హెలికాఫ్టర్లే ఎక్కువ కూలిపోతాయి..!

విమానాల కంటే హెలికాఫ్టర్లే ఎక్కువ కూలిపోతాయి..!

Date:

విమానాల కంటే సాధారణంగా హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయి. ఎక్కడో ఒక దగ్గర హెలికాప్టర్లు కుప్పకూలినట్లు తరచుగా వార్తల్లో వింటుంటాం. ఈ సంఘటనతో కమర్షియల్ విమానాల కంటే హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లైట్స్‌ ఎందుకు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత చాలామందిలో ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

*హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతాయి..

హెలికాప్టర్లు, విమానాల ప్రయాణ ఎత్తు, వేగంలో చాలా తేడా ఉంటుంది. క్రాష్‌లకు దారి తీసే ప్రధాన కారకాలు ఇవి. హెలికాప్టర్లు సాధారణంగా విమానాల కంటే తక్కువ ఎత్తులో, స్లోగా ఎగురుతాయి. లో-అల్టిట్యూడ్‌లో హెలికాప్టర్లు ప్రయాణిస్తాయి కాబట్టి విద్యుత్ లైన్లు, భవనాలు, చెట్లు, పక్షులు వంటివి వీటిని ఢీకొట్టే అవకాశం ఉంది. దీంతో ఇవి క్రాష్‌ అయ్యే రిస్క్ ఎక్కువ. హెలికాప్టర్ మెషినరీలోని సంక్లిష్టత, సున్నితత్వం కూడా ప్రమాదాలకు దారి తీస్తాయి. వీటిలో మెయిన్ రోటర్, టెయిల్ రోటర్, ట్రాన్స్‌మిషన్, ఇంజన్ ఉంటాయి. హెలికాప్టర్ ఎగరడానికి, సరిగ్గా కంట్రోల్ కావడానికి ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. వీటిలోని ఏదైనా పరికరంలో లోపం ఉంటే హెలికాప్టర్ కూలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల, హెలికాప్టర్లకు రెగ్యులర్, టోటల్ మెయింటెనెన్స్, ఇన్‌స్పెక్షన్ అవసరం. అయితే, నిర్లక్ష్యం లేదా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొన్ని క్రాష్‌లు సంభవిస్తాయి.

బలమైన గాలులు, తుఫానులు తట్టుకోలేవు

విమానాల కంటే హెలికాప్టర్లను ఫ్లై చేయడం, కంట్రోల్ చేయడం కష్టమని విలియమ్స్ చెప్పారు. హెలికాప్టర్లకు పైలట్ నుంచి స్థిరమైన, కచ్చితమైన ఇన్‌పుట్లు అవసరమవుతాయి. ప్రత్యేకించి చాలా తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు కాన్‌స్టంట్, ప్రిసైస్ ఇన్‌పుట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు విమానాలు చాలా వరకు ఆటోపైలట్ మోడ్‌పై ఆధారపడతాయి. ఇది పైలట్ పనిభారాన్ని తగ్గిస్తుంది. హెలికాప్టర్లు వాతావరణం, గాలి నుంచి మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటాయి. అవి తక్కువ ఎత్తులో ఎగురుతాయి కాబట్టి బలమైన గాలులు, తుఫానులు, పొగమంచు లేదా మంచు వంటి ప్రతికూల వాతావరణాలు ఫేస్ చేస్తాయి. హెలికాప్టర్ పర్ఫామెన్స్, పైలట్ విజిబిలిటీ వీటివల్ల దెబ్బతింటుంది.

* హెలికాప్టర్లు వాటికి ముఖ్యం

విమానాల కంటే హెలికాప్టర్లను చాలా ప్రమాదకర, డిమాండింగ్ పనులకు ఎక్కువగా ఉపయోగిస్తారని విలియమ్స్ చెప్పారు. ఉదాహరణకు హెలికాప్టర్లు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్స్‌, అగ్నిమాపక, సైనిక మిషన్లు లేదా భారీ లోడ్లను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పరిస్థితులు ప్రమాదకరమైనవి, అనూహ్యమైనవి. ఈ పనులకు హెలికాప్టర్లను ఫ్లై చేసే పైలట్‌కు హై లెవెల్ స్కిల్, ఎక్స్‌పీరియన్స్ అవసరం. విమానాల కంటే హెలికాప్టర్లు ఎక్కువగా కూలిపోవడానికి కొన్ని కారణాలు ఇవేనని విమానయాన నిపుణులు రెబెక్కా విలియమ్స్ వివరించారు.