Monday, November 18, 2024
HomeUncategorizedజరా.. చూపు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం

జరా.. చూపు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం

Date:

అందాల పోటీలు ప్రాణం ఉన్న మనుషులకు అందులో మహిళలకు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు ప్రాణం లేని వర్చువల్ హ్యూమన్స్‌కి, అంటే కంప్యూటర్/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా జనరేట్‌ చేసిన బొమ్మలకు సైతం ఈ పోటీలు పెడుతున్నారు. ‘మిస్ AI’ పేరుతో నిర్వహిస్తున్న AI జనరేటెడ్ మహిళ అందాల పోటీల్లో ‘జరా శతావరి’ అనే ఇండియన్ AI ఉమెన్ కూడా పోటీపడుతోంది. తాజాగా ఈ కాంపిటీషన్‌లో పది ఫైనలిస్ట్‌లుగా ప్రకటించగా అందులో జరా కూడా నిలిచింది. చూపు తిప్పుకోనివ్వని అందంతో ఈ ఏఐ ఉమెన్ చాలా హాట్‌గా కనిపిస్తోంది.

ప్రపంచంలోనే మొదటిసారి నిర్వహించిన ఈ పోటీలో 1,500 మందికి పైగా వర్చువల్ హ్యూమన్స్ పోటీ పడ్డాయి. వీటిలో కేవలం పది AI ఉమెన్స్‌ ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ పది AI-జనరేటెడ్ కంటెస్టెంట్స్ టాప్ 3 పొజిషన్స్ కోసం పోటీపడతాయి. ఈ నెల చివరిలో విజేతలను ప్రకటించనున్నారు. వీటి అందం, టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. జరా శతావరి తనను తాను “PCOS అండ్ డిప్రెషన్ వారియర్” అని పిలుచుకుంటోంది. ఈ ఇండియన్ AI ఉమెన్, హెల్తీ లైఫ్‌స్టైల్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.

హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, జరా శతావరి హెల్త్, కెరీర్ డెవలప్‌మెంట్, ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి చాలా నాలెడ్జ్ షేర్ చేస్తుంది. తద్వారా ప్రజలు మంచి లైఫ్‌స్టైల్ గడిపేలా ప్రోత్సహిస్తుంది. అలాగే అభిమానులతో ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఏర్పరచుకోవాలని, వారిని క్రమం తప్పకుండా మోటివేట్ చేయాలని ఆశిస్తుంది. ఈ డిజిటల్ బ్యూటీ హెల్త్, ఫ్యాషన్ ట్రెండ్స్‌పై బ్లాగులను ప్రచురించే ఓ వెబ్‌సైట్‌ను కూడా రన్ చేస్తుంది.

సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్

ఈ AI ఉమెన్ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో, ఆమెకు సంబంధించిన చాలా ఫొటోలు ఉన్నాయి. యోగా బంతిపై హోపింగ్ చేయడం, ఒక ప్రశాంతమైన ట్రాపికల్ స్పా బయట విశ్రాంతి తీసుకోవడం, ఆదివారం ఉదయం రిలాక్స్ అవ్వడం వంటి ఫొటోలు కూడా ఉన్నాయి. ఒక ఫొటోలో రెడ్ కలర్ చీర కట్టుకొని, దీపాలతో నిండిన గదిలో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కనిపించింది. మరొక ఫొటోలో ఆమె అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియజేసింది.

డెవలపర్ క్రియేటివిటీ

జరా శతావరిని రాహుల్ చౌదరి డెవలప్ చేశారు. ఆయన భారతదేశానికి చెందిన ఒక మొబైల్ ప్రకటనల సంస్థ సహ వ్యవస్థాపకుడు. ఇటీవల ఫోర్బ్స్‌తో మాట్లాడుతూ, AI ప్రయోజనాలు, నష్టాల గురించి చాలా చర్చలు జరుగుతున్నా దానిని మనం ఎలా ఉపయోగిస్తాం అనే దానిపై అన్నీ ఆధారపడి ఉంటాయని చెప్పారు. జరా శతావరి లక్ష్యం AI సామర్థ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమని.. మానవాళికి దానిని ఎలా ఉపయోగించుకోవచ్చో చూపిస్తామని చౌదరి తెలిపారు.