Monday, November 18, 2024
HomeUncategorizedఅరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు

అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టును కోరింది. తదుపరి విచారణకు సీఎం కస్టడీ ముఖ్యమంతి ఈడీ వాదనలు వినిపించింది. అయితే, వాదనలను కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది వివేక్‌ జైన్‌ కొట్టిపడేశారు. ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్‌ ‘యోగ్యత లేనిది’ అని పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది.

ఆ తర్వాత ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో తిహార్‌ జైలులో ఉంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత మరికొద్ది రోజులు మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన మళ్లీ జూన్‌ 2న జైలులో లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో వైపు ఇదే కేసులో నిందితుడు వినోద్‌ చౌహాన్‌ కస్టడీని జూలై 3 వరకు పొడిగించారు. చౌహాన్‌ను మేలో అరెస్టు చేశారు.