Friday, October 4, 2024
HomeUncategorizedశిశువు కోసం జపాన్ నుంచి రక్తం తెప్పించారు

శిశువు కోసం జపాన్ నుంచి రక్తం తెప్పించారు

Date:

అత్యంత అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు మృత శిశువు జన్మించకుండా కాపాడింది. వివరాల్లోకి వెళితే… హర్యానాలోని గ్రామీణ ప్రాంత మహిళ ఒకరు ఏడుసార్లు గర్భం ధరించి, అన్నిసార్లూ గర్భంలోనే శిశువును కోల్పోయారు. ఎనిమిదోసారి ఆ దంపతులు న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ను సంప్రదించారు. ఆమె శరీరంలోని యాంటీబాడీస్‌ ఆమె గర్భంలోని శిశువుకు ముప్పుగా పరిణమిస్తున్నాయని వైద్యులు గుర్తించారు.

గర్భిణి రక్తం ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ గ్రూప్‌ అని, అది ఆమె గర్భంలోని శిశువు బ్లడ్‌ టైప్‌నకు భిన్నమైనదని గుర్తించారు. ఆ గర్భస్థ శిశువును ప్రాణాలతో కాపాడాలంటే, ఇంట్రాయుటెరిన్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ చేయడం ఒకటే ఏకైక మార్గమని నిర్ణయించారు. ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌గలవారు లక్ష మందిలో ఒకరే ఉంటారు. భారతదేశంలో ఈ రక్తంగలవారు ఒకరు కనిపించినప్పటికీ, రక్తదానం చేయడానికి ఆ వ్యక్తి నిరాకరించారు. వెంటనే ఇంటర్నేషనల్‌ బ్లడ్‌ రిజిస్ట్రీకి సమాచారం అందించారు. జపాన్‌లోని రెడ్‌ క్రాస్‌ సొసైటీ స్పందించి, ఈ రక్తాన్ని భారత్‌కు పంపించింది. 48 గంటల్లో ఈ రక్తం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చేరుకుంది. ఈ రక్తాన్ని గర్భిణి గర్భంలోని శిశువుకు ట్రాన్స్‌ఫ్యూజ్‌ చేశారు. ఆరోగ్యవంతమైన ఆడ శిశువు జన్మించింది.