Friday, October 4, 2024
HomeUncategorizedగుంతల రోడ్లపై ఎమ్మెల్యేపై ఆవేదన

గుంతల రోడ్లపై ఎమ్మెల్యేపై ఆవేదన

Date:

రహదారి గుంతలమయంగా మారడంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి సొంత పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. రోడ్డు బాగయ్యే వరకు టోల్‌ ట్యాక్స్‌ వసూళ్లను నిలిపివేయాలని కోరారు. అస్సాంలోని ఖుమ్తాయ్ అసెంబ్లీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మృణాల్ సైకియా గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని ఉద్దేశించి ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. గుంతలు, నీటితో అధ్వాన్నంగా ఉన్న రహదారి వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారు. జాతీయ రహదారితో అనుసంధానించే రోడ్డు 37కు టోల్ వసూలు నిలిపివేయాలని అందులో కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈ పోస్ట్‌ను ట్యాగ్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే మృణాల్ సైకియా పోస్ట్‌పై కొందరు స్పందించారు. ప్రభుత్వం నుంచి ఒకరు ఈ సమస్యను ప్రస్తావించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘రహదారి సమస్యపై ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు మాట్లాడటం మంచిదే. రహదారి పరిస్థితి మెరుగుపడే వరకు ఎన్‌హెచ్‌-37 మొత్తాన్ని టోల్ ఫ్రీ చేయాలి. ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది’ అని ఎక్స్‌లో ఒకరు పేర్కొన్నారు. అలాగే బీజేపీ ఎంపీగా గౌరవ్ గొగోయ్ విజయంపై అస్సాం వాసి విమర్శించగా అతడిపై కేసు నమోదైంది.