Friday, October 4, 2024
HomeUncategorizedకూర‌గాయ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

Date:

రాష్ట్రంలో ఒక్కసారిగా కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. అర‌కొర సంపాద‌న‌తో బతుకు బండి లాగుతున్న సామాన్యులు కూర‌గాయ‌లు కొన‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లు మ‌ళ్లీ ఆకాశాన్నంటాయి. వంట‌కు ప్ర‌ధాన‌మైన ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. గృహిణులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ‌త నాలుగైదు రోజుల నుంచి ఉల్లి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ట‌మాటా ఉన్న‌ట్టుండి నిన్న‌టి నుంచి భారీ ధ‌ర ప‌లుకుతోంది.

నాణ్య‌మైన మొద‌టి ర‌కం ట‌మాటా కిలో రూ. 80 నుంచి రూ. 90 ప‌లుకుతోంది. సెకండ్ క్వాలిటీ ట‌మాటా కిలో ధ‌ర రూ. 60 నుంచి 70 ఉంది. ఇక హోల్ సేల్ మార్కెట్ల‌లో రూ. 120కి మూడు కిలోల ట‌మామా విక్ర‌యిస్తున్నారు. ఇక కేజీ ఉల్లిపాయ ధ‌ర రూ. 50పైనే ప‌లుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 60కి విక్ర‌యిస్తున్నారు. ట‌మాటా, ఉల్లిపాయ ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు కూర‌గాయలు కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.