Friday, October 4, 2024
HomeUncategorizedఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు

Date:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు. భారీ కాన్వాయ్ తో వెలగపూడిలోని సచివాలయానికి సతీమణితో వచ్చిన చంద్రబాబు సరిగ్గా సాయంత్రం 4.41నిమిషాలకు సీఎం కుర్చిలో కూర్చొని బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిందే తడవుగా మొదటిగా మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్న చంద్రబాబుకు రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. దారి పొడవున పూలుజల్లి సీఎంపై తమ ఆదరాభిమానాలు చూపించారు.

ఆ ఐదు ఫైళ్లపై సంతకం..

ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నారాచంద్రబాబునాయుడు ముందుగా పెట్టుకున్న ముహుర్తం ప్రకారం గురువారం సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.ఇందులో ప్రధానమైనది మెగా డిఎస్సీ ఫైలుపై సంతకం చేస్తారు. అలాగే వైసీపీ సర్కారు తెచ్చిన ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేస్తూ రెండో ఫైలుపై సంతకం చేస్తారు. వీటితో పాటు 4వేల రూపాయలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటిన్ పునరుద్దీరణ, స్కిల్ సెన్సెక్స్ పై సంతకాలు చేసి పరిపాలన ముద్ర వేయనున్నారు.

చంద్రబాబు సంతకం చేసిన 5ఫైల్స్ ఇవే..

1.తొలి సంతకం – మెగా డీఎస్సీ ..!

2.రెండో సంతకం – ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.

3.మూడో సంతకం – 4వేల రూపాయలకు పింఛన్ పెంపు.

⁠4.నాల్గవ సంతకం – అన్న క్యాంటిన్ పునరుద్దీరణ.

⁠5.ఐదవ సంతకం – స్కిల్ సెన్సెక్స్

ప్రజలకు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తమ ప్రభుత్వం పరిపాలన భాద్యతలు స్వీకరించగానే ప్రజలకు అవసరమైన, ఆమోదయోగ్యమైన పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అందుకే గతంలో టీడీపీ పాలనలో చేపట్టిన అన్న క్యాంటిన్ల ప్రారంభంతో పాటు పెంచిన ఫించన్ ను అందజేసేందుకు సముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.