Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ ప్రధాని హసీనాను కలిసిన సోనియా

బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను కలిసిన సోనియా

Date:

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కలిసి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను సోమవారం కలిశారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శనివారం ఢిల్లీకి చేరుకున్న షేక్‌ హసీనా ఆదివారం జరిగిన ప్రధాని మోడీ, ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, గాంధీ కుటుంబానికి మధ్య ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరా గాంధీ ముఖ్యపాత్ర పోషించారు. పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ కుటుంబం, షేక్ హసీనా కుటుంబంతోపాటు భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య దీర్ఘకాల కృతజ్ఞతా భావాన్ని, పరస్పర గౌరవాన్ని ఇది పెంపొందించింది.