Thursday, October 3, 2024
HomeUncategorizedమోడీకి పాకిస్థాన్‌ ప్రధాని శుభాకాంక్షలు

మోడీకి పాకిస్థాన్‌ ప్రధాని శుభాకాంక్షలు

Date:

భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీకి పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏడు పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ.. పాకిస్థాన్‌కు మాత్రం భారత్‌ ఆహ్వానం పంపలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో మోదీకి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా ఇటీవల శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. పరస్పర అవగాహన, ఇరుదేశాల ఆందోళనలను అర్థం చేసుకుంటూ, కెనడాతో పని చేసేందుకు భారత్‌ ఎదురుచూస్తోందని చెప్పారు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. వీటికి దీటుగా బదులిస్తోన్న భారత్‌.. ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను చూపెట్టాలని డిమాండ్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.