Thursday, October 3, 2024
HomeUncategorizedవందేభారత్‌ రైళ్ల వేగం తగ్గింది

వందేభారత్‌ రైళ్ల వేగం తగ్గింది

Date:

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. తక్కువ సమయంలోనే సుదూర ప్రయాణాలకు వెళ్లడానికి వెసులుబాటు ఉండటంతో జనాలు కూడా వీటిని ఆదరిస్తున్నారు. అయితే వందే భారత్‌ రైళ్ల సంఖ్య ఎంతగా పెరుగుతుందో.. వాటి వేగం అంతలా తగ్గిపోతుందంట! గడిచిన మూడేండ్లలో వందే భారత్‌ రైళ్లు ప్రయాణించే వేగం గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ వెల్లడించింది.

వందేభారత్‌ రైళ్లను 2019 ఫిబ్రవరి 15వ తేదీన తొలిసారిగా ప్రారంభించారు. గంటలకు 160 కిలోమీటర్ల వేగతంతో ప్రయాణించేలా వీటిని అత్యాధునిక టెక్నాలజీతో పునరుద్ధరించారు. కానీ వందేభారత్‌ రైళ్ల సగటు వేగం 2020-21లో 84.48 కిలోమీటర్లు ఉండగా.. 2022-2 నాటికి ఆ వేగం 81.38 కిలోమీటర్లకు, 2023-24 నాటికి 76.26 కిలోమీటర్లకు పడిపోయిందని రైల్వే శాఖ వెల్లడించింది. కేవలం వందే భారత్‌ రైళ్లు మాత్రమే కాదని, వివిధ మార్గాల్లో ట్రాక్‌ పునరుద్ధరణ, స్టేషన్ల నవీకరణ కారణంగా సాధారణ రైళ్ల వేగం కూడా తగ్గిందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వే అధికారులు ఈ మేరకు సమాధానమిచ్చారు.