Thursday, October 3, 2024
HomeUncategorizedఅవినీతిపై పటిష్టమైన పోరాటం చేస్తాం

అవినీతిపై పటిష్టమైన పోరాటం చేస్తాం

Date:

దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించిన ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే బుధవారం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం చివరిసారిగా సమావేశమైంది. ఈ సందర్భంగా మోడీ కేబినెట్‌కు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలపై కూడా ఆయన మాట్లాడారు. ఫలితాల్లో నంబర్ల గేమ్‌ కొనసాగుతూనే ఉంటుంది. ఇది రాజకీయాల్లో భాగమే. దశాబ్ద కాలంలో దేశ అభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అందుకు మీరూ ఎంతో శ్రమించారు. దీన్ని ఇలాగే కొనసాగించండి. అవినీతిపై పోరాటం మరింత పటిష్ఠంగా మారుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతిని కొందరు (ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) కీర్తిస్తున్నారు. ఈ సారి అవినీతిని రూపుమాపడంపై ఎన్డీయే దృష్టి సారిస్తుంది. ప్రపంచంలో భారత్‌ బలమైన శక్తిగా అవతరిస్తుంది. మనమంతా సమష్టిగా కృషి చేస్తే సరికొత్త అధ్యాయాన్ని లిఖించవచ్చు. ఇదే ప్రజలకు మోడీ హామీ” అని ప్రధాని అన్నారు.

కొందరు 10 గంటలు పనిచేస్తే.. నేను దేశం కోసం 18 గంటలు శ్రమిస్తా. వారు రెండు అడుగులు వేస్తే.. నాలుగు అడుగులతో ముందుకు సాగుతా. అన్ని ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజల అభివృద్ధికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉంది” అని మోడీ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. జూన్‌ 8న మోదీ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.