Thursday, October 3, 2024
HomeUncategorizedలోక్‌స‌భ‌లోకి యూపీలో గెలిచినా యువ ఎంపీలు

లోక్‌స‌భ‌లోకి యూపీలో గెలిచినా యువ ఎంపీలు

Date:

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోక్ సభ ఎన్నికల్లో యువతరం అడుగుపెట్టింది. ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా వృద్ధ నాయ‌కుల‌కు స్వ‌స్తి ప‌లికి, యువ‌తను గెలిపించుకున్నారు. గెలిచిన యువ‌త‌లో అత్య‌ధికులు విద్యావంతులు, ఆంగ్లంలో అన‌ర్గ‌ళంగా మాట్లాడేవారు ఉన్నారు. యూపీ అభివృద్ధే త‌మ ల‌క్ష్య‌మని గెలుపొందిన యువ నాయ‌కులు చెబుతున్నారు.

పుష్పేంద్ర సరోజ్..

పుష్పేంద్ర స‌రోజ్.. ఈయ‌న వ‌య‌సు కేవ‌లం 25 ఏండ్లు మాత్ర‌మే. లోక్‌స‌భ‌లో యంగెస్ట్ మెంబ‌ర్ కూడా. లండ‌న్‌లోని క్వీన్ మేరీ యూనివ‌ర్సిటీ నుంచి అకౌంటింగ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ అందుకున్నారు. స‌మాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై కౌశంబి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి 1.03 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స‌రోజ్ చేతిలో బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ ఓడిపోయారు. పుష్పేంద్ర తండ్రి ఇంద్రజిత్ స‌రోజ్ యూపీ అసెంబ్లీ ఎమ్మెల్యే. నా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై దృష్టి సారిస్తాన‌ని పుష్పేంద్ర స‌రోజ్ స్ప‌ష్టం చేశారు.

ఇక్రా హ‌స‌న్..

ఇక్రా హ‌స‌న్.. ఈమె వ‌య‌సు 27 ఏండ్లు. కైరానా నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌మాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై గెలుపొందారు. లండ‌న్ యూనివ‌ర్సిటీ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ లా కోర్సు పూర్తి చేసి పీజీ ప‌ట్టా పుచ్చుకున్నారు. నా నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధితో పాటు మ‌హిళా సాధికార‌త కోసం కృషి చేస్తాన‌ని ఇక్రా చెప్పారు. వెనుక‌బ‌డిన త‌రగ‌తుల్లోని వారి కోసం మెరుగైన విద్య‌ను అందించ‌డ‌మే నా ల‌క్ష్య‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

ప్రియా స‌రోజ్..

ప్రియా స‌రోజ్.. ఈమె వ‌య‌సు 25 ఏండ్లు. సుప్రీం కోర్టు లాయ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. మ‌చ్చిలిషార్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌మాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై 35,850 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మాజీ ఎంపీ తుఫానీ స‌రోజ్ కుమార్తెనే ప్రియా స‌రోజ్.

ఆనంద్ గోండ్..

ఆనంద్ గోండ్.. పీహెచ్‌డీ ప‌ట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ డిగ్రీ క‌లిగి ఉన్నారు. బీజేపీ త‌ర‌పున బహ్రెచ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి 64,227 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఉజ్వ‌ల్ ర‌మ‌ణ్ సింగ్‌..

ఉజ్వ‌ల్ ర‌మ‌ణ్ సింగ్.. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివ‌ర్సిటీ లా స్కూల్‌లో న్యాయ‌విద్య చ‌దివారు. అల‌హాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి 58,795 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

శశాంక్ మ‌ణి త్రిపాఠి..

శశాంక్ మ‌ణి త్రిపాఠి.. ఐఐటీ ఢిల్లీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఐఎండీ ల్యావుస‌నే నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. డియోరియా నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ టికెట్‌పై 34,842 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.