Thursday, October 3, 2024
HomeUncategorizedఅన్న పతనాన్ని కళ్లారా చూసిన చెల్లెలు

అన్న పతనాన్ని కళ్లారా చూసిన చెల్లెలు

Date:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడిన ఫలితాలు తెలుగుదేశం పార్టీలో ఊహించలేని జోష్‌ను నింపాయి. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అనుకోని సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో- అనూహ్య పరిణామాలు ఏర్పాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు.

వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం 20 సీట్లను కూడా దక్కించుకోలేనంత దీనస్థితికి చేరింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లయినా లభించాయి. అయిదు సంవత్సరాలు తిరిగే సరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది. వైఎస్ జగన్ కేబినెట్‌లోని దాదాపు మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాలన్నీ కుప్పకూలిపోయాయి. టీడీపీ- జనసేన- బీజేపీకి కలిపి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి.

వైఎస్ఆర్సీపీ సాధించిన ఈ ఘోర పరాజయం నేపథ్యంలో ఏపీ మొత్తానికీ అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఆమె కంటే మోస్ట్ హ్యాపియెస్ట్ పర్సన్ మరొకరు ఉండకపోవచ్చు. వైఎస్ఆర్సీపీ పతనాన్ని ఆమె ఆస్వాదించినంతగా మరెవరూ ఆస్వాదించకపోవచ్చు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల ట్రెండ్ సృష్టిస్తోన్నారు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక వర్గం మొత్తం కూడా ఆమెను ఆకాశానికెత్తేస్తోంది. తన అన్న వైఎస్ జగన్‌పై పగ తీర్చుకున్నారంటూ ప్రశంసిస్తోన్నారు. వైఎస్ఆర్సీపీ దారుణ ఓటమిలో షర్మిల సైతం ఓ చెయ్యి వేసిందంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు