Thursday, October 3, 2024
HomeUncategorizedతెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం

తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం

Date:

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తెలంగాణ రాష్ట్రంలో సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది పోటీలో ఉన్నారు. 2,20,24,806 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది పోటీలో నిలిచారు. 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు, సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. చొప్పదండి, దేవరకొండ, యాఖుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపునకు సుమారు 10 వేల మంది సిబ్బంది నియామకం, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు, మద్యం దుకాణాల బంద్ చేస్తున్నట్లు తెలిపారు.