Wednesday, October 2, 2024
HomeUncategorizedప్రైవేట్‌ భాగాల్లో కిలో బంగారం దాచిన ఎయిర్ హోస్టెస్‌

ప్రైవేట్‌ భాగాల్లో కిలో బంగారం దాచిన ఎయిర్ హోస్టెస్‌

Date:

ఎయిర్ హోస్టెస్‌ తన ప్రైవేట్‌ భాగాల్లో దాదాపు కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించారు. ఈ ఘటన కేరళలోని కన్నూరు ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 

మే 28న మస్కట్ నుంచి కేరళలోని కన్నూరుకు ఒక విమానం చేరుకుంది. అయితే ఆ విమానంలోని బంగారం స్మగ్లింగ్ జరుగుతుందని డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. డీఆర్ఐ కొచ్చిన్ ద్వారా అందిన నిర్ధిష్ట సమాచారం ఆధారంగా కన్నూర్ డీఆర్ఐ అధికారులు మే 28న కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మస్కట్ నుండి వచ్చిన ఓ విమానంలో తనిఖీ చేశారు. విమానంలో ఎయిర్‌హోస్టెస్‌గా ఉన్న కోల్‌కతాకు చెందిన సురభి ఖాతున్ అనే మహిళను అడ్డుకుని తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఆమె మలద్వారాంలో 960 గ్రాముల బంగారం గుర్తించారు. అనంతరం బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రూల్స్ ప్రకారం ఆమెపై విచారణ చేపట్టారు. అనంతరం సురభి ఖాతున్‌ను జురిస్డిక్షనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తరువాత కన్నూర్‌లోని మహిళా జైలులో 14 రోజుల రిమాండ్‌కు పంపారు.