Wednesday, October 2, 2024
HomeUncategorizedఎండీఆర్ ఫౌండేషన్ కు ఉగాది పురస్కారం

ఎండీఆర్ ఫౌండేషన్ కు ఉగాది పురస్కారం

Date:

పేదవారికి ఏ అవసరం ఉన్నా, ఆపద్బాంధవుడిలా సాయం కోసం ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న మానవతావాది ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు. మెగా ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో 2024 ఉగాది పురస్కారాలు సోషల్ సర్వీస్ కేటగిరిలో ఎండిఆర్ ఫౌండేషన్ ను బెస్ట్ ఫౌండేషన్ గా ఎంపిక చేసి నంది అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఎండిఆర్ ఫౌండేషన్ కు నంది అవార్డు ప్రధానం చేశారు. ప్రతి పేదవారికి ఏ అవసరం ఉన్న అవసరం తీరుస్తూ ఆదుకుంటున్న గొప్ప మహానీయ వ్యక్తి ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అని ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు అన్నారు. ఈ అవార్డుతో సమాజంలో మరింత బాధ్యత గుర్తు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆసిఫ్, ప్రణయ్, పార్దు గౌడ్ తో కలసి అవార్డ్ అందుకోవటం జరిగింది.