దేశ రాజధాని ఢిల్లీలో స్పైస్‌జెట్ విమానం అదివారం ఢిల్లీ నుంచి లేహ్‌కు బయలుదేరింది. అయితే విమానంలోని ఒక ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ విమానంలోని ప్రయాణికులను దించివేశారు.
స్పైస్‌జెట్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ఢిల్లీ నుంచి లేహ్‌కు టేకాఫ్ అయిన ఎస్‌జీ-123 సర్వీసుకు చెందిన బీ737 విమానం ఇంజిన్ 2ను పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు సాధారణంగానే విమానం నుంచి దిగారు’ అని ప్రకటించారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాకుండా సాధారణంగా ల్యాండింగ్ చేసినట్లు వివరించారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు స్పైస్‌జెట్ అధికారి తెలిపారు.