Wednesday, October 2, 2024
HomeUncategorizedకోర్టులో ప్యూన్‌కు చదవడం, రాయడం రాదు

కోర్టులో ప్యూన్‌కు చదవడం, రాయడం రాదు

Date:

కోర్టులో ప్యూన్‌గా పనిచేస్తున్న ప్రభు లక్ష్మీకాంత్‌ లోఖరే (23)కు చదవడం, రాయడం రాదని తెలుసుకుని జడ్జి ఆశ్చర్యపోయారు. కర్ణాటకలోని కొప్పల్‌ రాయ్‌చూర్‌ జిల్లాలోని సింధనూర్‌ తాలూకాకు చెందిన ప్రభుకు టెన్త్‌ పరీక్షలో 99.5 శాతం (623/625) మార్కులు వచ్చాయి.

ఈ మార్కుల ఆధారంగా ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌ 22న కోర్టులో ప్యూన్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఉద్యోగం చేయడం ప్రారంభించిన కొద్ది రోజులకే ఆయన గురించి జడ్జికి తెలిసింది. దీంతో ఆ జడ్జి పోలీసులకు ప్రైవేట్‌ కంప్లయింట్‌ ఇచ్చారు.