ఓ సెక్స్ వర్కర్ చేసిన పని వందల మందిని ఆందోళనకు గురిచేసింది. తనకు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక సంబంధం నెరిపింది. ఈ విషయం తెలిసి కంగుతున్న అధికారులు.. స్థానికులను అప్రమత్తం చేశారు. ఆమెతో శృంగారంలో పాల్గొన్న వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ హెల్త్ అలర్ట్ జారీ చేశారు. సదరు మహిళను అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో వెలుగు చూసింది.
ఒహైయోలోని మరియెట్టాకు చెందిన లిండా లెచెసే ఓ సెక్స్ వర్కర్. అక్కడి మార్కెట్ వీధిలో అనేక మందిని ఆకర్షిస్తుండేది. ఇలా 2022లో జనవరి నుంచి ఇప్పటివరకు అనేక మందితో లైంగిక సంబంధం కొనసాగించింది. ఇదే సమయంలో ఆమె హెచ్ఐవీ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అయినా సరే లిండా తన కార్యకలాపాలను కొనసాగించింది. రెండున్నరేళ్లలో దాదాపు 211 మందితో ఆమె సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు గుర్తించారు.
లిండా చర్యలతో అప్రమత్తమైన అధికారులు.. పబ్లిక్ హెల్త్ నోటీసులు జారీ చేశారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పొరుగు రాష్ట్రాలతోపాటు స్థానిక పౌరులకు సూచించారు. ఆమె క్లయింట్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ.. మిగతా ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని సూచిస్తున్నామని వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు, మెరియెట్టా పోలీసులు వెల్లడించారు.