Monday, December 23, 2024
Homeఅంతర్జాతీయంరోజురోజుకు ప్రాణాంతకంగా మారుతున్న హెపటైటిస్

రోజురోజుకు ప్రాణాంతకంగా మారుతున్న హెపటైటిస్

Date:

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు హెపటైటిస్ తో 3500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హెపటైటిస్ పరీక్షలు, చికిత్సలు తగ్గడం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. 2030 నాటికి హెపటైటిస్ ను పూర్తిగా నిర్మూలించాలనే డబ్ల్యూహెచ్ఓ లక్ష్యం పూర్తిగా ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. 2024 గ్లోబల్ హెపటైటిస్ రిపోర్టు ప్రకారం.. 187 దేశాల్లో హెపటైటిస్ తో మరణాలు సంఖ్యం పెరిగిందని వెల్లడించింది. 2019లో 1.1 మిలియన్ల ప్రజలు ఈ వైరస్ తో మరణించగా.. ఆ సంఖ్య 2022లో 1.3 మిలియన్లకు చేరింది. ఇది టీబీ వ్యాధి మరణాలతో సమానం. ఈ మరణాల్లో హైపటైటిస్ బితో ఎక్కువ మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 83 శాతం మంది హెపటైటిస్ బి తో మరణించినట్లు వెల్లడించింది. మిగతా మరణాల్లో హెపటైటిస్ సి వాటా ఉందని తెలిపింది.

హెపటైటిస్ అనగా కాలేయానికి చెందిన వ్యాధి. ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని రకాల మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీటిలో వైరస్ వల్ల కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ అంటారు. వైరస్ నిర్ధారణలో ఆరోగ్య అధికారుల వైఫల్యాలను డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ నివేదిక హైలైట్ చేసింది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో ప్రపంచవ్యాప్తంగా పురోగతి ఉన్నప్పటికీ, హెపటైటిస్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న వ్యక్తులు మరణిస్తున్నారని తెలిపింది.హెపటైటిస్ నుంచి ప్రజలను రక్షించేందుకు మద్దతు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్ఓ కట్టుబడి ఉందని వెల్లడించింది.