Wednesday, October 2, 2024
HomeUncategorizedవిజయశాంతి బీఆర్ఎస్ వైపు చూస్తుందా..?

విజయశాంతి బీఆర్ఎస్ వైపు చూస్తుందా..?

Date:

కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన తాజా ట్వీట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. బీజేపీ గులాబీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి స్పందించారు. విజయశాంతి తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ మొదలైంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ విజయశాంతి ట్వీట్ చేసారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు, వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానంగా పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి.. కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీ సమాధానం అన్నారు. దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు. కిషన్‌రెడ్డి మాటలతో అది స్పష్టం అవుతోందన్నారు. విజయశాంతి ట్వీట్‌ పొలిటికల్‌ సర్కిల్లో చర్చకు దారి తీసింది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడటంపై డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్‌లో చేరినప్పటినుంచి విజయశాంతి సైలెంట్‌గానే ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించినా.. కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కాంగ్రెస్‌లో రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారని చర్చ ఉంది. ఈ సమయంలో విజయశాంతి చేసిన తాజా ట్వీట్‌తో రాములమ్మ అడుగులు ఎటు వైపు అనే చర్చ మొదలైంది.