Wednesday, October 2, 2024
HomeUncategorizedతెలంగాణలో రాగల 5 రోజులు మోస్తరు వర్షాలు

తెలంగాణలో రాగల 5 రోజులు మోస్తరు వర్షాలు

Date:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాగల 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఐదు రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్‌ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ర్టంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు వెల్లడించింది.

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌, బాచుపల్లి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్‌, ప్యారడైజ్‌, చిలకలగూడ, అల్వాల్‌, జవహర్‌నగర్‌, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, నాగారం, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌, గాజులరామారం, సూరారం, బహదూర్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్‌నగర్‌, ఉప్పల్‌లో గురువారం భారీగా వర్షం పడింది.