Friday, September 20, 2024
HomeUncategorizedసొంత కూటమికే న్యాయం చెయ్యడం లేదు

సొంత కూటమికే న్యాయం చెయ్యడం లేదు

Date:

కొంతమంది తమ సొంత కూటమిలోని వారికే న్యాయం చేయలేకపోతున్నారు, అందుకే ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో వారి విభేదాలు బయటపడుతున్నాయని కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శలు గుప్పించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో విభేదాలు బయటపడుతున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు.

లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిహార్‌లో అధికార కూటమి ఆర్జేడీ-కాంగ్రెస్‌-జేడీయూ బంధం దాదాపు బీటలు వారింది. త్వరలోనే అక్కడ భాజపా మద్దతుతో నీతీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే నిజమైతే లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘ఇండియా’ కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బే. మరోవైపు, తృణమూల్‌ కాంగ్రెస్‌తో కూడా కాంగ్రెస్‌కు విభేదాలు ఏర్పడ్డాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ వరకు తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన ప్రకటనతో ఇది స్పష్టమైంది. ఈ క్రమంలోనే రాహుల్‌ చేపట్టిన యాత్రకు బెంగాల్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. బహిరంగ సభలకు దీదీ సర్కారు అనుమతినివ్వలేదన్న వార్తలు వస్తున్నాయి.