అవినీతి రహిత సమాజం కోసం వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళతామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా సోమాజిగూడలోని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహదారులు మాజీ ఆర్టీఐ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, రిటైర్డ్ విజిలెన్స్ వ్యవసాయ అధికారి దన్నపునేని అశోక్ కుమార్ హజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో అవినీతి నిర్మూలన కోసం ప్రశ్నించడం అలవాటు చేసుకొవాలన్నారు. సమాజంలో అవినీతి నిర్మూలించేందుకు, మంచిని పెంచాలనే ఆలోచనతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వివిధ రంగాల్లో ఉన్న నిజాయితీపరులను గుర్తించడం మంచి కార్యక్రమమన్నారు. సమాజంలోని మంచి మార్పు కోసం సంస్థ యువతను, ప్రజలను ఏకం చేస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, డా. స్రవంతి, కొన్నె దేవేందర్, వరికుప్పల గంగాధర్, జి. హరిప్రకాశ్, లక్ష్మికళ, గీతానందు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.