Monday, September 30, 2024
HomeUncategorizedఆసుపత్రిలో ఉన్నా.. ఓటు వేసేందుకు వచ్చారు

ఆసుపత్రిలో ఉన్నా.. ఓటు వేసేందుకు వచ్చారు

Date:

దేశంలో జరుగుతున్న రెండో దశ పోలింగ్‌లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి బెంగళూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ”ప్రతి ఐదేళ్లకు ఒకసారి మనకు ఈ ఓటు హక్కు వస్తుంది. ఎంతో విశ్లేషణ తర్వాత ఈ హక్కును వినియోగించుకోవాలి. ఎవరూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు” అని నారాయణ మూర్తి ఓటర్లకు సూచించారు.

నారాయణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో ఉన్నా.. ఓటు వేసేందుకు ఇక్కడకు వచ్చారు. ఓటింగ్ తర్వాత ఆయన్ను ఇంటికి తీసుకెళ్తాం. మేం పర్యటనలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్లాన్స్‌ వేసుకున్నాం. కానీ.. వాటన్నింటికంటే ముందు ఓటు వేయడం ముఖ్యం. కూర్చొని మాటలు చెప్పే బదులు బయటకు వచ్చి, మీ హక్కును వినియోంచుకొని మీ అభిప్రాయాన్ని చెప్పండి. మాలాంటి సీనియర్లు వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. యువత తప్పక రావాలి. సాధారణంగా విద్యావంతులు తక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటారు. మీ హక్కును మీరు తప్పక ఉపయోగించుకోవాలి” అని సుధామూర్తి పిలుపునిచ్చారు. మామూలుగా బెంగళూరులో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంటుంది. దానిని ఉద్దేశించి ఆమె స్పందించారు. వీరిద్దరు జయనగరలోని బీఈఎస్‌ కాలేజ్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.