Monday, September 30, 2024
HomeUncategorizedతెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు

Date:

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దానికి తోడు రాగల ఐదురోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అదే సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుండడంతో ఉష్ణోగ్రతుల పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఆదివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

శుక్రవారం మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వనపర్తి జోగులాంబ జిల్లాల్లో.. శనివారం మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వడగాలులు వీస్తాయంటూ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. 28న నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ అవగా.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

ఆదివారం కుమ్రంభీం, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 29న నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలు, 30న కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వడగాలలు వీస్తాయని చెప్పింది.