Monday, September 30, 2024
HomeUncategorizedఅలా అయితే భారతదేశంలో వాట్సాప్ సేవలు నిలిపివేయాల్సి వస్తోంది

అలా అయితే భారతదేశంలో వాట్సాప్ సేవలు నిలిపివేయాల్సి వస్తోంది

Date:

ఎన్‌క్రిప్షన్‌ను విచ్చిన్నం చేయాల్సి వస్తే, భారతదేశంలో వాట్సాప్‌ సేవలు నిలిపివేయాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు బెంచ్‌కి తెలిపారు. సవరించిన సమాచారం సాంకేతిక నిబంధనలకు వ్యతిరేకంగా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించారు. ఐటి నిబంధనలకు సవరణలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ , సంప్రదింపులు లేకుండా నిబంధనలను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఇది వినియోగదారుల గోప్యతకు వ్యతిరేకమని పేర్కొంది. వాట్సాప్‌ను యూజర్లు గోప్యతా ఫీచర్ల కోసం ఉపయోగిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే యూజర్ల గోప్యత కోసం వాట్సాప్‌ ఎండ్ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్ల డేటా ఎవరికీ తెలియకుండా ఉంటుంది. అయితే ఎన్‌క్రిప్షన్‌ను తొలగించాలని అనడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 మరియు 21 ప్రకారం వినియోగదారుల ప్రాథమిక హక్కులను ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని సంస్థ వాదిస్తోంది. ఇలాంటి నిబంధనలు ప్రపంచంలో మరెక్కడా లేవని వాట్సాప్‌ తరపున న్యాయవాది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ నిబంధనలు అమలు చేయకపోతే నకిలీ సందేశాల మూలాన్ని కనుగొనడంలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఇబ్బంది పడతాయని మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటి సందేశం దేశంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగిస్తుందని, పబ్లిక్ ఆర్డర్ సమస్యలను కలిగిస్తుందని పేర్కొంది. మరి ఈ వ్యవహారం ఎటు వైపు మలుపు తీసుకుంటుందో చూడాలి.