Monday, September 30, 2024
HomeUncategorizedపత్రికల్లో ఇచ్చిన క్షమాపణల యాడ్స్ సైజ్ ఎంత

పత్రికల్లో ఇచ్చిన క్షమాపణల యాడ్స్ సైజ్ ఎంత

Date:

పతంజలి సంస్థ పత్రికల్లో ప్రకటించిన క్షమాపణల యాడ్స్ గురించి మంగళవారం సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసింది. ఆ కేసులో మంగళవారం జస్టిస్ హిమా కోహ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ ఏ సైజులో ఉన్నాయని జస్టిస్ కోహ్లీ ప్రశ్నించారు. పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన యాడ్స్ సైజులో.. క్షమాపణల యాడ్స్ ఉన్నాయా అని ఆమె అడిగారు. దానికి సీనియర్ అడ్వికేట్ బదులిస్తూ ఉత్పత్తులకు ఇచ్చిన యాడ్స్‌కు లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు.

క్షమాపణ యాడ్స్ సైజ్‌ను కొలిచేందుకు.. ప్రింట్ అయిన కాపీలను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. యాడ్స్‌ను కట్ చేసి, వాటిని మాకివ్వాలని, వాటిని పెద్దగా చేసి చూపవద్దు అని, ఆ యాడ్స్‌కు చెందిన అసలు సైజ్‌ను చూడాలనుకుంటున్నామని, ఇది మా ఆదేశమని, క్షమాపణ యాడ్స్‌ను ప్రచురించినప్పుడు, వాటిని భూతద్దం పెట్టి చూడవద్దు అని, పత్రికల్లో యాడ్స్‌ను చదివే రీతిలో ఉండాలని జస్టిస్ కోహ్లీ తెలిపారు.